News February 14, 2025

సంగారెడ్డి: రేపు ప్రభుత్వ పాఠశాలలో పీటీఎం సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపు తల్లిదండ్రుల(పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

Similar News

News October 20, 2025

MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 1/2

image

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట (M) కురుమూర్తిలో ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచనగుహగా పేరొందిన కురుమూర్తి కొండలలోని వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ.1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. Way2News ప్రత్యేక కథనం.

News October 20, 2025

సత్యభామలా ఆత్మస్థైర్యంతో ఉందాం..

image

నరకాసురుడితో యుద్ధం చేసి చంపడంలో శ్రీకృష్ణుడికి సత్యభామ సహకరిస్తుంది. మనలోని నిరాశ, అలసత్వం, పిరికితనం వంటి బలహీనతలను నరకసారుడిగా భావించి ధైర్యం, అప్రమత్తత, తెగింపు, ఆత్మస్థైర్యం, చురుకుదనంతో అతివలు పోరాడాలి. ఎక్కడ ప్రేమను చూపాలో, ఎక్కడ విజృంభించాలో తెలిసిన శక్తిస్వరూపుణి సత్యభామ. నేటితరం యువతులు ఆ గుణాలను ఆకళింపు చేసుకుంటే జయం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.
* స్త్రీమూర్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

News October 20, 2025

పోలీసు అమరవీరుల వారోత్సవాల షెడ్యూల్ ఇదే

image

జిల్లాలో అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ నివాళులర్పిస్తారు. 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, 24న 2000 మంది విద్యార్థులతో 5కే రన్ ఉంటుంది.