News February 9, 2025

సంగారెడ్డి: రేపు భౌతిక, రసాయన శాస్త్రం ప్రతిభా పరీక్ష

image

పదవ తరగతి విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రం జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ప్రతిభా పరీక్షకు హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.

Similar News

News September 14, 2025

డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

image

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స‌హాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.

News September 14, 2025

నేడు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ బాధ్యతల స్వీకరణ

image

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీశ్ కుమార్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలో పాల్గొంటారు. అనంతరం బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈయన గతంలో గుంటూరులో పని చేశారు.

News September 14, 2025

భువనగిరి: రేపు జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళా

image

ఈ నెల 15న జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ టీఎల్‌ఎంలను ప్రదర్శించాలని ఆయన సూచించారు. భువనగిరి కలెక్టరేట్ దగ్గరలోని ఏకే ప్యాలెస్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమాచారాన్ని ఆయా మండల విద్యాధికారులు ఉపాధ్యాయులకు తెలియజేయాలని పేర్కొన్నారు.