News April 9, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కర్ణాటకలోని బీదర్ జిల్లా ఖానాపూర్లో జరిగిన ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. మినీ బస్సు, బైక్ను ఢీకొట్టడంతో న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన కార్మికులు ఇస్మాయిల్(25), రమేష్(44) మృతి చెందగా.. బసవరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి తర్వాత మరొకరి మృతదేహాలు గ్రామానికి వస్తుండగా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News October 18, 2025
తిరుపతి హాథీరాంజీ మఠం పూర్తిగా శిథిలం.?

తిరుపతిలోని హాథీరాంజీ మఠంపై అధికారుల అధ్యయనం పూర్తి అయినట్లు సమాచారం. మఠంలోని చాలా భాగం పూర్తిగా శిథిలం అయినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థానిక నాయకులు హాథీరాంజీ వంశస్థులతో చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోనున్నారట. కూలగొట్టే పరిస్థితి వస్తే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చి ప్రాచీన కట్టడాలు కాపాడుకొనేలా ప్రయత్నం చేయాలని బంజారా సంఘాలు కోరుతున్నట్లు సమాచారం.
News October 18, 2025
రాష్ట్రంలో 34 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News October 18, 2025
పత్తి కొనుగోళ్లు, కౌలు రైతు నమోదుపై ADB కలెక్టర్ సమీక్ష

జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదు, క్రాప్ బుకింగ్, పంట నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.