News April 14, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

image

సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహన యజమాని మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బీదర్ నుంచి తిరుపతికి బేరం కుదుర్చుకుని వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో 12 మందికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Similar News

News October 30, 2025

సిద్దిపేట: దంపతులు గల్లంతైన వాగును పరిశీలించిన కలెక్టర్

image

అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి భీమదేవరపల్లికి చెందిన ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కె.హైమావతి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాలకు గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News October 30, 2025

పెద్దపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ

image

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 31న ఉదయం 6 గంటలకు “రన్ ఫర్ యూనిటీ” పేరుతో 2K రన్ నిర్వహించనున్నారు. ఈ 2K రన్ పెద్దపల్లి ఐటీఐ కాలేజ్ గ్రౌండ్‌ నుంచి జండా చౌరస్తా వరకు జరగనుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని యువతలో ఐక్యతా స్ఫూర్తి, దేశభక్తి సందేశాన్ని వ్యాప్తి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సాగనుంది.

News October 30, 2025

మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

image

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.