News April 16, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రేగోడ్ మండలంలోని పట్టెపొలం తండాకు చెందిన లావుడియా సక్రీ బాయి, సుభాష్ బైక్పై వెళ్తున్నారు. నిజాంపేట్ మండలం బాచుపల్లి శివారులో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ (ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 10 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://iigm.res.in/
News November 23, 2025
ఉమ్మడి నల్గొండలో ‘బడుగు’లకే పట్టం

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల ఎంపికలో అధిష్ఠానం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చింది. జిల్లాలోని మూడు అధ్యక్ష పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాలకే పెద్దపీట వేసింది. నల్గొండ, భువనగిరి జిల్లాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించగా, సూర్యాపేట జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎస్సీ సమాజానికి చెందిన నాయకుడికి అప్పగించింది. ఈ నిర్ణయం ద్వారా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
News November 23, 2025
ఖమ్మం: సామాన్య కార్యకర్త నుంచి జిల్లా సారథిగా..

ఖమ్మంకాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వైరా నేత నూతి సత్యనారాయణ గౌడ్ రాజకీయ ప్రస్థానం దశాబ్దాల నాటిది. గతంలో ఆయన NSUI, యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పార్టీని పటిష్ఠం చేయడంలో, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.


