News February 2, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్ గుప్త, చిట్కూల్‌కు చెందిన సురేశ్ గుప్త కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మేడ్చల్ PS పరిధిలో కంటెయినర్‌ను కారు ఢీకొంది. దీంతో డ్రైవర్ నర్సింహా(28), శంకర్ (46), సురేశ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2025
జగిత్యాల: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 20 ZPTCలు, 216 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
News February 10, 2025
స్కిల్ వర్సిటీకి నిధులివ్వలేం: కేంద్రం

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి కేంద్రం షాక్ ఇచ్చింది. దానికి నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా INC MP చామల కిరణ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా సమాధానం ఇచ్చింది. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాయని, వీటికి నిధులిచ్చే పథకమేమీ కేంద్రం వద్ద లేదని మంత్రి జయంత్ చౌదరి తేల్చి చెప్పారు.
News February 10, 2025
వికారాబాద్: స్థానిక సంస్థల స్థానాలు ఇవే..!

వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సీటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కన్నేశారు. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ZPTC స్థానాలు- 20, MPP- 20, MPTC- 227, గ్రామ పంచాయతీలు- 594, వార్డులు- 5,058 ఉన్నాయి. రేపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా వెలువడనుంది. అభ్యంత్రాల అనంతరం 15న కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా విడుదలవుతుంది.