News February 27, 2026

సంగారెడ్డి: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించండి’

image

సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Similar News

News April 16, 2026

GNT: మాస్టర్ మైండ్స్ సత్తా.. టాప్ ఫలితాలు

image

జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ కళాశాల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో సత్తా చాటారు. జూనియర్ ఇంటర్‌లో ఐదుగురు 496 మార్కులు సాధించగా, 320 మందికి పైగా 490 పైన మార్కులు సాధించడం విశేషం. సీనియర్ MEC విభాగంలో గీతిక 984 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. సంస్థ క్రమశిక్షణ, నాణ్యమైన బోధనే ఈ విజయాలకు కారణమని యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

బ్యాంకర్లకు తిరుపతి ఎస్పీ సూచనలు

image

సైబర్ మోసాల కట్టడి నిమిత్తం పోలీసులు, బ్యాంకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. డిజిటల్ అరెస్ట్, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, OTP మోసాలపై బ్యాంకర్లకు అవగాహన కల్పించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించాలని సూచించారు. ఇంటర్నేషనల్ కాల్స్ ద్వారా జరిగే బ్యాంక్ ఫ్రాడ్‌లపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.