News February 11, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

image

మెదక్ జిల్లా కాట్రియల్ ఉన్నత పాఠశాలలో హిందీ పండితుడు సలావుద్దీన్ సోమవారం పాఠశాల నుంచి విధులు ముగించుకుని వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. 12 సంవత్సరాలు నార్సింగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్‌గా పనిచేసి ఇటీవలే పదోన్నతి పొంది కాట్రియల్‌కు బదిలీ అయ్యాడని తెలిపారు.

Similar News

News December 8, 2025

ములుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికల UPDATE

image

ములుగు జిల్లాలో మొదటి విడత ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొత్తం 09 సర్పంచ్, 128 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో మొత్తం 148 సర్పంచ్, 796 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేయగా, మండల పరిషత్ కార్యాలయాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి.

News December 8, 2025

మూసిన గదిలో రాసిన పత్రం కాదిది: భట్టి

image

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసిన గదిలో రాసిన పత్రం కాదని, ఇది ప్రజల పత్రమని గ్లోబల్ సమ్మిట్‌లో Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమన్నారు. కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంశాలతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళా శక్తి, రైతుభరోసా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్-1గా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 8, 2025

అంగారకుడిపైనా గంగా తరహా నదీ వ్యవస్థ

image

జీవనానికి అనుకూలమైన గ్రహం కోసం చేస్తోన్న అన్వేషణలో కీలక ముందడుగు పడింది. INDలో గంగా నదీ వ్యవస్థ మాదిరిగానే అంగారకుడిపైనా వాటర్ నెట్‌వర్క్ ఉండేదని టెక్సాస్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. అక్కడ 16 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలను వారు మ్యాపింగ్ చేశారు. ‘బిలియన్ ఏళ్ల కిందట మార్స్‌పై వర్షాలు కురిసేవి. జీవం కూడా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలి’ అని చెప్పారు.