News February 17, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు..కోహిర్ మండలం షెట్టేగుంట తండాలో విందుకు వెళ్లిన పవన్(26), శంకర్(25).. అనంతరం బైక్ పై సిద్దాపూర్ తండాలోని బంధువుల ఇంటికి వెళ్తన్నారు. ఈ క్రమంలో గొడిగార్‌పల్లి శివారులో మూలమలుపు వద్ద బస్సు, బైక్ ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా శంకర్ చనిపోయారు.
Similar News
News April 10, 2026
రామాయంపేట: సైకిల్ పై నుంచి కిందపడి రైతు మృతి

సైకిల్ పై నుంచి కిందపడి రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు మల్లయ్య అనే రైతు తన పొలానికి వెళ్లి వస్తుండగా సైకిల్‌కు కుక్క అడ్డు రావడంతో కిందపడి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 10, 2026
కన్నవారు లేకున్నా.. చెల్లెళ్లకు అమ్మగా మారిన ‘లావణ్య’.

13 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ముగ్గురు ఆడపిల్లల జీవితాల్లో పెద్దక్క లావణ్య వెలుగులు నింపింది. మెదక్ జిల్లా రామాయంపేటకి చెందిన బైరం యాదగిరి-రాజమణి దంపతులు మృతి చెందగా, చిన్న వయసులోనే ఇంటి బాధ్యతను లావణ్య భుజాన వేసుకుంది. కన్నీటిని దిగమింగి, అమ్మానాన్న లేని లోటు తెలియనీయకుండా తన ఇద్దరు చెల్లెళ్లు ప్రియాంక, పూజలను ఒక తల్లిలా సాకి ఉన్నత చదువులు చదివించింది. # నేడు సిబ్లింగ్స్ డే
News April 10, 2026
ఆధునిక సాంకేతికతను వినియోగించాలి: కలెక్టర్

ఆధునిక సాంకేతికతతో పంటల వివిధీకరణ చేపట్టి ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని కోరారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని, మత్స్య సంపద పెంపుపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖకు దిశానిర్దేశం చేశారు.


