News October 19, 2024

సంగారెడ్డి: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి’

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా లకడారం, కంది, నోవా పాన్, ముత్తంగి స్వీట్ హార్ట్ కార్నర్, రుద్రారం గీతం రోడ్, కవలం పేట్ మామిడిపల్లి ఎక్స్ రోడ్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

Similar News

News November 9, 2024

మార్టూరులో రూ. 250 కోట్లతో చక్కర ఫ్యాక్టరీ ప్రారంభం

image

రాయికోడ్ మండలం మార్టూరు గ్రామంలో రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన గోదావరి గంగా ఆగ్రో ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చక్కర ఫ్యాక్టరీని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. చక్కర కార్మాగారం ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ అంజయ్య, ఏఎంసీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ఆర్డిఓ రాంరెడ్డి పాల్గొన్నారు.

News November 9, 2024

పెన్షన్లు పెంపు ఎన్నడు రేవంత్ రెడ్డి..?: హరీశ్ రావు

image

వృద్ధులకు రూ.4,000 వికలాంగులకు రూ.6,000 పెన్షన్ పెంచుతాననని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇంకెప్పుడు పెంచుతావని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. 11నెలల పరిపాలనలో పేదవాళ్లకు ఒక్క ఇల్లు అయినా కట్టించావా అని నిలదీశారు. CM చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదన్నారు.

News November 9, 2024

పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి: డీఈవో రాధాకిషన్

image

మెదక్ డీఈవో కార్యాలయంలో డిఈవో రాధా కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. వితౌట్ ప్రిపరేషన్ టీచర్స్ పాఠ్యాంశాలు బోధించడం, ప్లాన్ ప్రకారం తరగతిలో టీచర్లు బోధించే విధంగా కృషి చేయాలని నిర్దేశం చేశారు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో అందరు విద్యార్థులు, ముఖ్యంగా స్లో లెర్నర్లు పాల్గొనే విధంగా చూడాలని తెలిపారు.