News March 4, 2025
సంగారెడ్డి: రోబోటిక్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న మినీ శిల్పారామం కన్వెన్షన్ హాల్లో జరిగిన రోబోటిక్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో జిల్లా నుంచి ఏడు పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మొత్తం 11 పాఠశాలలు పాల్గొనగా ఏడు పాఠశాల విద్యార్థులు డైమండ్ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News October 30, 2025
మంచిర్యాల: బైక్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో జరిగింది. ASF జిల్లా సుద్దాపూర్ వాసి గంగుబాయి దేవాపూర్‌కు వలస వచ్చారు. ఆమె కొడుకు సాయి(20) మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. బైక్ కోసం తల్లిని వేధించగా ఆమె డబ్బు లేదనడంతో మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. గతంలోనూ సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. SI గంగారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 30, 2025
కేయూ: ఎల్ఎల్బీ పరీక్షలు వాయిదా

భారీ వర్షాల ప్రభావంతో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గురువారం జరగాల్సిన న్యాయశాస్త్ర విభాగం సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డాక్టర్ అసీం ఇక్బాల్ తెలిపారు. మూడు, ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు, బీటెక్ మొదటి ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
News October 30, 2025
ఖమ్మంలో అర్ధరాత్రి హై అలర్ట్

మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలలో అర్ధరాత్రి పోలీసులు, మున్సిపల్ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మున్నేరు ప్రవాహనం పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు 17 అడుగుల వద్ద ఉన్న వాగు అర్ధరాత్రి 22 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని బొక్కలగడ్డ, మోతీ నగర్ ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. తెల్లవారుజామున 5 గంటలకు 23 అడుగులకు చేరుకుంది.


