News April 14, 2025
సంగారెడ్డి: లారీని ఢీకొని వ్యక్తి మృతి

చౌటకూర్ మండలం శివ్వంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. సంగారెడ్డి నుంచి జోగిపేట వెళ్తున్న లారీని బైక్‌పై వస్తున్న వ్యక్తి వెనుక నుంచి ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి సందర్శించి పరిశీలించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
స్వర్గమంటే ఇదే.. హిమాచల్ అందాలు చూడండి!

వింటర్ వెకేషన్‌కు విదేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం సంస్థలు స్థానిక అందాలను SMలో పంచుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెట్ల ఆకులన్నీ నారింజ రంగులోకి మారి, ప్రశాంత వాతావరణంతో భూతల స్వర్గంలా మారింది. ‘ఇది నార్వే కాదు.. హిమాచల్‌ప్రదేశ్’ అంటూ ‘Go Himachal’ పోస్ట్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్లో కులు మనాలీ, సిమ్లా వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిటకిటలాడనున్నాయి.
News November 7, 2025
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

తిరుపతిలోని <
News November 7, 2025
భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.


