News February 21, 2025

సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం కావాలి: SP

image

మార్చి 8న జరిగే లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించేలా చూడాలని పోలీసులకు ఎస్పీ రూపేశ్ ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ కార్యాలయం నుంచి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

Similar News

News November 8, 2025

ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో శాండ్‌ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్‌ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్‌ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్‌ ఉంటుంది.

News November 8, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

➤ WWC విజయం: రిచా ఘోష్‌ను డీఎస్పీగా నియమించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం
➤ AUSvsIND టీ20 సిరీస్‌: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అభిషేక్ శర్మ
➤ వరుసగా 12వ టీ20 సిరీస్ గెలిచిన టీమ్ఇండియా
➤ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ
➤ IPL: నవంబర్ 15న తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించనున్న జట్లు.. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో LIVE చూడొచ్చు.

News November 8, 2025

మురికి కాలువల పక్కన కొత్త ఇల్లు కట్టొచ్చా?

image

మురికి కాలువల సమీపంలో ఇల్లు కట్టుకోవడం ఆరోగ్యానికి హానికరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. మురికి కాలువల వల్ల అపరిశుభ్రత, కాలుష్యం పెరిగి, దుర్గంధం కారణంగా తరచుగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని ఆయన సూచన. ‘నివాస స్థలంలో శుభ్రత, స్వచ్ఛత లేకపోతే అక్కడ సానుకూల శక్తి నిలవదు. అందుకే శుభ్రత, ప్రశాంతత ఉండే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి’ అని వాస్తు శాస్త్రం చెబుతోంది. <<-se>>#Vasthu<<>>