News March 9, 2025
సంగారెడ్డి: లోక్ అదాలత్లో 14,3 07 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్లో 14,307 కేసులు పరిష్కరించినట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. కొన్ని కేసుల్లో నష్టపరిహారం కూడా ఇప్పించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
జనగామలో బాల్య వివాహం నిలిపివేత

జనగామలోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు ఆదివారం నిలిపివేశారు. చైల్డ్ హెల్ప్లైన్ 1098కు వచ్చిన సమాచారం మేరకు బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్లైన్, పోలీసు శాఖ, ఐసీడీఎస్ శాఖ సిబ్బంది సంయుక్తంగా వెళ్లి బాల్య వివాహాన్ని ఆపారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ.. బాల్యవివాహం చేయడం, సహకరించడం, ప్రోత్సహించడం, హాజరుకావడం కూడా చట్టపరంగా శిక్షార్హమని అన్నారు.
News November 23, 2025
తిరుపతి: అమ్మవారి పంచమీ తీర్థానికి పటిష్ఠ ఏర్పాట్లు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టింది. పంచమీ తీర్థం అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ భద్రత, నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
News November 23, 2025
పల్నాడు ఉత్సవాల్లో అపశ్రుతి

పల్నాడు ఉత్సవాల్లో ఆదివారం ముగింపు వేళ విషాదం చోటుచేసుకుంది. నాగులేరులో స్నానాలు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ ఆకస్మికంగా తెగి పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


