News April 4, 2024
సంగారెడ్డి: ‘వడదెబ్బకు దూరంగా ఉందాం’

వేసవిలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉందన్న వడదెబ్బకు దూరంగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను బుధవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు సాధ్యమైనంత వరకు రావద్దని చెప్పారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశాంక్ దేశ్పాండే పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి భూ భారతి: కలెక్టర్

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం భూ భారతిని అమలు చేస్తున్నట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. భూ భారతి పోర్టల్ అమలులో భాగంగా శుక్రవారం అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూ భారతి చట్టం -2025పై అవగాహన కార్యక్రమంలో హాజరయ్యారు. అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ మల్లయ్య, కాగ్రెస్ మండల ప్రెసిడెంట్ శేషా రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
News April 18, 2025
న్యాయవాదుల అభిమానం మరువలేనిది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం మరువలేనిదని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి శారద అన్నారు. సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా మెదక్ కోర్టులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలందించడం గొప్పవరం అన్నారు. ప్రతి న్యాయవాది పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు. మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.
News April 18, 2025
మెదక్: ఈ నెల 21న అప్రెంటిషిప్ మేళా

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా పథకం ద్వారా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 21న అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొననున్నారని అన్నారు. మెదక్ జిల్లాలోని ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.