News February 20, 2025

సంగారెడ్డి: వర్సిటీ ప్రొఫెసర్ ఆత్మహత్య

image

సంగారెడ్డి జిల్లా కంకోల్‌లోని వోక్స్ వ్యాగన్ వర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనర్ ప్రొఫెసర్ సుమంత్ కుమార్(36) సూసైడ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 12 అయినా సుమంత్ క్లాస్‌‌కు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న మునిపల్లి SI రాజేశ్ నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని సదాశివపేట ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఝర్ఖండ్‌లో సుమంత్ ఫ్యామిలీకి సమాచారం ఇచ్చారు.

Similar News

News April 22, 2025

మెదక్: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.!

image

మెదక్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థులు 49.21% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,028 పాస్ అయ్యారు. 3125 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 39.09 % కాగా, బాలికలు 57.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు పైచేయి సాధించడంతో జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

News April 22, 2025

రేగోడ్ పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్

image

రేగోడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. ఆరోగ్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.

News April 22, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

image

☞ఫస్ట్ ఇయర్‌ (స్టేట్)
సంగారెడ్డి – 60.20 శాతంతో 13వ ర్యాంక్
సిద్దిపేట – 51.50 శాతంతో 29వ ర్యాంక్
మెదక్- 49.24 శాతంతో 31వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌లో ..
సంగారెడ్డి – 69.26 శాతంతో 16వ ర్యాంక్
మెదక్ – 61.52 శాతంతో 30వ ర్యాంక్
సిద్దిపేట – 59.56 శాతంతో 31వ ర్యాంక్

error: Content is protected !!