News February 24, 2025

సంగారెడ్డి: వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

image

వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా వారణాసి వద్ద టిప్పర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి(46), ఆయన భార్య విలాసిని (40), న్యాల్ కల్ మండలం మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 15, 2025

జిల్లాలో రూ.51.22 కోట్ల నిధి ఉంది: కలెక్టర్

image

ఖనిజ సంపద కింద చిన్న, పెద్ద గ్రానైట్ క్వారీలు, ఇసుక క్వారీల నుంచి చట్టబద్ధంగా సీనరేజ్ ద్వారా ఖనిజ సంపద నిధి సేకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం సూచించారు. ప్రస్తుతం జిల్లాలో రూ.51.22 కోట్ల నిధి ఉందన్నారు. మార్చి నాటికి మరో రూ.4 కోట్లు సీనరేజ్ వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాకు వచ్చే ఖనిజ సంపదను జిల్లా అభివృద్ధికి వినియోగించాలన్నారు.

News October 15, 2025

అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం: లోకేశ్

image

AP: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉత్తరాంధ్రలో TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్, తిరుపతి శ్రీసిటీలో డైకెన్, బ్లూస్టార్, LG సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం’ అని వెల్లడించారు.

News October 15, 2025

వంటింటి చిట్కాలు

image

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.