News February 19, 2025
సంగారెడ్డి: విద్యార్థిని అభినందించిన డీఈవో

జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి భౌతికశాస్త్రం ప్రతిభ పరీక్ష పోటీలో న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ పాఠశాలకు చెందిన సాదియ నౌశిన్ అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డీసీఈబి సెక్రటరీ లింబాజి, సైన్స్ అధికారి సిద్ధారెడ్డిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News January 7, 2026
మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి డైలీ బస్సులు

మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి బస్సులు శుక్రవారం నుంచి ప్రతి రోజు నడుస్తాయని డిపో మేనేజర్ కళ్యాణి తెలిపారు. ఎక్స్ ప్రెస్ సర్వీసు ప్రతిరోజు ఉదయం 6 గంటల బయలుదేరి 9 చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4 బయలుదేరి 7 గంటల వరకు మహబూబాబాద్‌కు వస్తుందని ఆమె తెలిపారు. పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.160 టికెట్ ధర ఉంటుందన్నారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు.
News January 7, 2026
జగన్‌పై మంత్రి స్వామి విమర్శలు

పబ్లిసిటీ పిచ్చితో పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు వేసుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి స్వామి విమర్శించారు. కొండపి మండలం తాటాకులపాలెంలో ఆయన బుధవారం పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రికార్డులను తారుమారు చేయడానికి వీలులేని విధంగా కొత్తపాస్ పుస్తకాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రతి దశలో అన్నదాతకు అండగా ఉంటున్నామన్నారు.
News January 7, 2026
సిరిసిల్ల: ‘యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు’

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. జిల్లాలో యూరియాకు కొరత లేదని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామన్నారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో యూరియా కొరత ఉన్నట్లు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు.


