News February 23, 2025
సంగారెడ్డి: విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్

కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వసతి గృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెన్షన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులతో వంటలు చేసిన వార్తలు వెలువడడంతో నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఫిజికల్ డైరెక్టర్ మహేశ్, మ్యాథ్స్ టీచర్ శివకుమార్లను సస్పెన్షన్ చేశారు.
Similar News
News November 16, 2025
చంద్రబాబూ.. ఇదేనా మీ విజన్: జగన్

AP: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉందని YS జగన్ ఆరోపించారు. 2025-26 FY తొలి 6 నెలల CAG గణాంకాలను Xలో షేర్ చేశారు. రెండేళ్ల కాలానికి పన్నుల వృద్ధి CAGR కేవలం 2.75% ఉండగా, ప్రభుత్వం పేర్కొంటున్న 12-15% వృద్ధి పూర్తిగా అవాస్తవమని విమర్శించారు. తమ హయాంలో పన్నుల వృద్ధి 9.87% ఉందన్నారు. కూటమి ప్రభుత్వ అప్పులు మాత్రం భారీగా పెరిగి రూ.2,06,959 కోట్లకు చేరాయని వెల్లడించారు.
News November 16, 2025
IPL 2026 వేలానికి స్టార్ ప్లేయర్లు

వచ్చే IPL సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్డ్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దీంతో స్టార్ క్రికెటర్లు వేలానికి వచ్చారు. ఆండ్రీ రస్సెల్, గ్లెన్ మాక్స్వెల్ , లివింగ్స్టోన్ వంటి ప్లేయర్లు బిడ్డింగ్లో టార్గెట్ కానున్నారు. అదే విధంగా పతిరణతో పాటు జోష్ ఇంగ్లిస్, బిష్ణోయి, జంపా, డేవిడ్ మిల్లర్, వెంకటేశ్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు కూడా మినీ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
News November 16, 2025
సంజయ్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా? ఊడుతుందా?

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల MLA సంజయ్ పై అసెంబ్లీలో విచారణ పూర్తైంది. స్పీకర్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. MLAపై వేటు పడుతుందా లేదా అనేదానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తే పశ్చిమ బెంగాల్ MLA ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసినట్లు ఇక్కడ కూడా ఆ పరిస్థితి లేకపోలేదని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.


