News February 23, 2025

సంగారెడ్డి: విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్

image

కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వసతి గృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెన్షన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులతో వంటలు చేసిన వార్తలు వెలువడడంతో నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఫిజికల్ డైరెక్టర్ మహేశ్, మ్యాథ్స్ టీచర్ శివకుమార్‌లను సస్పెన్షన్ చేశారు.

Similar News

News March 24, 2025

సీఎం పుట్టినరోజున ‘చంద్రన్న నాటకోత్సవాలు’

image

AP: వచ్చే నెల 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం పాటు ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20-26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక/సాంఘిక నాటకాలు, పద్య నాటకాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తిగలవారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక <>అకాడమీ చిరునామాకు<<>> పంపాలని కోరింది.

News March 24, 2025

రేపు 52 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో రేపు 52, ఎల్లుండి 88 మండలాల్లో <>వడగాలులు<<>> వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూ.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ALERT జారీ చేసింది. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News March 24, 2025

NZB: ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది గైర్హాజరు: డీఈవో

image

2025 పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 22,735 మంది విద్యార్థులకు 22,679 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో అధికారికంగా వెల్లడించారు.

error: Content is protected !!