News February 22, 2025

సంగారెడ్డి: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి: ఎస్పీ

image

విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

MBNR: స్థానిక ఎన్నికలు.. భారీగా నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ రెండో రోజున నామినేషన్లు భారీగా దాఖలు అయ్యాయి. అత్యధికంగా జడ్చర్ల మండలం నుంచి 81 నామినేషన్లు వచ్చాయి. బాలానగర్ మండలంలో 68 నామినేషన్లు, భూత్పూర్ మండలంలో 44 నామినేషన్లు, మూసాపేట మండలంలో 19 నామినేషన్లు, అడ్డాకులలో 37 నామినేషన్లు దాఖలయ్యాయి.

News December 5, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మూడో రోజు కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ మధుసూదన్ పర్యటన

News December 5, 2025

గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ‘సండే ఈవినింగ్‌ టాక్‌’

image

బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌ క్యాంపస్‌లో ఆదివారం ‘సండే ఈవినింగ్‌ టాక్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్‌మెంట్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.