News January 31, 2025
సంగారెడ్డి: ‘విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలి’

సంగారెడ్డిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దేవదాస్, RCO గౌతమ్ పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
భద్రకాళి ఆలయంలో వైభవంగా విశేష పూజలు

వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, పంచామృతాలతో అభిషేకించి, నూతన వస్త్రాలతో అమ్మవారిని దివ్యంగా అలంకరించారు. సెలవు రోజు కావడంతో నగరంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
News February 22, 2026
అల్లూరి జిల్లాలో చికెన్ రేటు తెలుసా?

అల్లూరి, పోలవరం జిల్లాలో ఆదివారం చికెన్ రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు, చింతపల్లి, రాజవొమ్మంగి, చింతూరు గ్రామాల్లో బ్రాయిలర్ చికెన్ రూ.240 నుండి రూ.260 చొప్పున కొనుగోలు చేస్తున్నాని వినియోగదారులు తెలిపారు. స్కిన్ లెస్ రూ.300వరకు అమ్ముతున్నారు. మేక మాంసం కిలో రూ.800, చేపలు రూ.250కి క్రoయిస్తున్నారు. ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఆదివారం నాన్ వెజ్ భారీగా అమ్ముడవుతుంది.
News February 22, 2026
చిక్కిపోతున్న చందమామ!

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని నేషనల్ ఎయిర్&స్పేస్ మ్యూజియానికి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రకంపాల వల్ల ఏర్పడే పగుళ్లే ఇందుకు కారణమని చెబుతున్నారు. చందమామపై పగుళ్ల గురించి శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలిసినా తాజాగా లూనార్ మారియా ప్రాంతాల్లో 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. వీటిని స్మాల్ మేర్ రిడ్జెస్ అని పిలుస్తున్నారు.


