News February 26, 2025
సంగారెడ్డి: విద్యుత్ కాంతుల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం

కాకతీయుల కాలంలో నిర్మించిన సంగారెడ్డి మండలం కల్పగురు గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 26వ తేదీన ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
‘తేజస్’ ప్రమాదంపై స్పందించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ <<18349994>>కూలిపోయిన<<>> ఘటనపై తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పందించింది. ఇది అసాధారణ పరిస్థితుల వల్ల జరిగిన ఘటన అని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ ప్రమాదాన్ని విమానం పనితీరుకు ప్రతిబింబంగా చూడకూడదు. ఇది మా వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్తు డెలివరీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. దర్యాప్తుకు సహకరిస్తున్నాం’ అని తెలిపింది.
News November 24, 2025
ప్రజా సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో విచారించి సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన తదితర అధికారులు పాల్గొన్నారు.
News November 24, 2025
పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్‌బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.


