News April 13, 2025

సంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పుల్కల్ మండలం మిన్ పూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో పొలం వద్ద రైతు రమావత్ రమేష్(33) శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. గాలి వాన బీభత్సం రావడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కరెంటు సరఫరా పునరుద్ధరించలేదని అధికారులు చెప్పడంతో రైతు రమేష్ శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లగా అక్కడే విద్యుత్ షాక్‌తో మరణించినట్లు తెలిపారు. ఈ నెల 16న రమేష్ సోదరుడి పెళ్లి జరగాల్సి ఉండగా విషాదం నెలకొంది.

Similar News

News November 26, 2025

RRR కేసు.. సునీల్ కుమార్‌కు సిట్ నోటీసులు

image

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్‌తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.

News November 26, 2025

అనంతపురం: ఆనంద్‌ది పరువు హత్య..?

image

ప్రేమ పేరుతో రప్పించి యనకళ్లు గ్రామానికి చెందిన వాల్మీకి బోయ ఆనంద్‌ను బ్రహ్మాసముద్రం మండలంలో హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం ఏపీ వాల్మీకి బోయ సంఘం నాయకులు అక్కులప్ప, మాధవయ్య తదితరులు ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐ హరినాథ్‌కు వినతి పత్రం అందించారు.

News November 26, 2025

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం

image

మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను డీపీఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు.