News February 7, 2025

సంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

అంగన్వాడీ ఉద్యోగులు వివిధ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.

Similar News

News March 15, 2026

విశాఖ: టెన్త్ పరీక్షలు రాసేవారికి బస్సులో ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News March 15, 2026

గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు: విశాఖ జేసీ

image

విశాఖ జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్‌నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్‌లు కాగా 37,920 సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు. కేవలం పుకార్ల వల్ల మాత్రమే బుకింగ్స్ పెరిగాయని ఆమె పేర్కొన్నారు.

News March 15, 2026

నిబంధనల మేరకు పక్కాగా సర్వే నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధన ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి, జనాభా గణన చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జనాభా లెక్కలు – 2027, శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. మొదటి దశ హౌసింగ్ లిస్ట్ మే 11 నుంచి జూన్ 9, రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుందన్నారు. మార్చి 1, 2027 రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తామన్నారు.