News April 10, 2025

సంగారెడ్డి: ‘వినియోగ ధ్రువపత్రాలు సమర్పించాలి’

image

జిల్లాలో రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తహ కార్యక్రమంలో ఎంపికైన 78 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగ ధ్రువపత్రాలను సమర్పించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సిద్దారెడ్డి మాట్లాడుతూ.. 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించిన నిధులను పాఠశాల ఖాతాలో జమచేయడం జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News April 18, 2025

డాక్టరేట్ అందుకున్న నగరం వాసి సత్యనారాయణ

image

మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారుడు, కళా భూషణ్ మంగం సత్యనారాయణ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ NT రామారావు కళామందిర్‌లో నిన్న జరిగిన సమావేశంలో శ్రీపొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ అవార్డుతో సత్యనారాయణను సత్కరించింది. ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

News April 18, 2025

సిరిసిల్ల: ఎయిర్ ఫోర్స్ అగ్ని వీర్లో ఉద్యోగాలు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీం ద్వారా వీర్ వాయు సంగీత విభాగంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్ తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు https://agnipathvayu.cdac.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఫ్రీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనుటకు ప్రొవిజినల్ అడ్మిట్ కార్డు పొందుతారన్నారు.

News April 18, 2025

అద్భుత కట్టడాల నిలయం.. చంద్రగిరి సామ్రాజ్యం

image

విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల కాలంలో చంద్రగిరి స్వర్ణయుగంలా అలరాలింది. రాయలవారి పాలనలో ఇక్కడ రత్నాలను రాసులుగా పోసి విక్రయించేవారు. క్రీస్తు శకం 1000 సంవత్సరంలో చంద్రగిరి కోటను నిర్మించారు. ఇక్కడి రాణి కోట, కొండపై ఉప్పు సట్టి, పప్పు సట్టి అనే కోనేరులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఎన్నో అద్భుత కట్టడాలకు చంద్రగిరి కోట నిలయంగా ఉంది. నేడు World Heritage Day

error: Content is protected !!