News January 27, 2025
సంగారెడ్డి: విషాదం.. బస్సు ఢీకొని చిన్నారి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల PS పరిధి దోమడుగు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బిహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ కుమార్(6)ను ఓ పాఠశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.
News November 9, 2025
జడ్చర్లలో నకిలీ రూ.500 నోట్ల కలకలం

నకిలీ రూ.500 నోట్లతో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని జడ్చర్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో దుకాణ యజమాని పట్టుకున్నాడు. శనివారం దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తి ఇచ్చిన మూడు నకిలీ రూ.500 నోట్లను యజమాని గుర్తించి నిలదీశాడు. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
News November 9, 2025
పల్నాడు యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా..!

మినీ మహాభారతం, ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్రకెక్కించిన పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం ఎక్కడో తెలుసా? పల్నాడు జిల్లా కారంపూడిలోని నాగులేరు వాగు ఒడ్డునే ఆ చారిత్రక ఘట్టం జరిగింది. యుద్ధంలో రక్తపుటేరులు ప్రవహించినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, అప్పటి ఆయుధాలను పూజిస్తూ ఇక్కడ వీరుల గుడిని నిర్మించారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.


