News November 2, 2024

సంగారెడ్డి: వీఆర్‌లో ఉన్న ఎస్సై వినయ్ కుమార్ సస్పెండ్

image

సంగారెడ్డి వీఆర్ ఉన్న ఎస్సై వినయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్సైగా వినయ్ కుమార్ పనిచేస్తున్న సమయంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో సక్రమంగా విధులు నిర్వహించ లేదని వీఆర్‌కు బదిలీ చేశారు. కాగా, ఈరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News December 8, 2024

గజ్వేల్: నేడు కేసీఆర్ అధ్యక్షతన BRSLP సమావేశం

image

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం జరగనున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి మెదక్ REPORT

image

రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్‌‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మెదక్‌ మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాల మంజూరు, జోగుపేట ఆసుపత్రి 150 పడకలకు పెంపు, పటాన్చెరు వరకు రూ.1700 కోట్లతో మెట్రో విస్తరణ, తిమ్మాపూర్‌లో 1000మందికి ఉపాధి లభించే కోకాకోలా కంపెనీ ప్రారంభం, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?

News December 7, 2024

MDK: ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్?

image

తూర్పు వరంగల్ MLA కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆమెకు CM రేవంత్ దేవాదాయ & అటవీ శాఖలు కేటాయించడంతో పాటు MDK ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా MDKలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రూ.500 గ్యాస్, రుణమాఫీ, జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మీ కామెంట్?