News October 20, 2024
సంగారెడ్డి: వృద్ధ దంపతులు ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పొలం వద్ద ప్రతాప్ సింగ్(60), కళావతి(55) పురుగుల మందు తాగగా, జహీరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News November 4, 2024
100 రోజులన్నారు.. 300 రోజులైంది: హరీశ్ రావు
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ సీఎం రేవంత్ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.
News November 3, 2024
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ అధ్యక్షుడిగా రాసిరెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా సదాశివపేటకి చెందిన నవాబు రాజిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచిరెడ్డి మాట్లాడుతూ.. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
News November 3, 2024
సంగారెడ్డి: శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులు
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి సంగారెడ్డి డిపో నుంచి నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసినట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ ఆదివారం తెలిపారు. ఈ బస్సులు ఉదయం 4.10, 5.50 నిమిషాలకు, మధ్యాహ్నం 1, 2 గంటలకు బయలు దేరుతాయని పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్ళే భక్తులు ఈ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.