News March 1, 2025
సంగారెడ్డి: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదంల్లో ముగ్గురు చనిపోయారు. సదాశివపేటలో వాటర్ ట్యాంకర్‌ను స్కూటీ ఢీకొన్న ఘటనలో <<15608397>>ఇంటర్ విద్యార్థి<<>> సాయికార్తీక్ మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొట్టిపల్లికి చెందిన సతీశ్(29) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నాడు. జిన్నారం మం. కాజిపల్లి శివారులో క్వారీ కూలి హిటాచీ డ్రైవర్ శ్రీనివాస్(30) మృతి చెందాడు.
Similar News
News March 1, 2025
కాకినాడ: 5,6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు సెలవు

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులు అందరూ వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవు ప్రకటించామన్నారు.
News March 1, 2025
NZB: యాసంగిలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల డిమాండ్ పెరిగిందని వివరించారు.
News March 1, 2025
దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.