News April 9, 2025
సంగారెడ్డి: వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడండి: కలెక్టర్

వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలను 100% ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు. 25%కు రాయితీతో ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30 వరకు పెంచినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
వర్షం మొదలైంది..

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్‌పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
News April 20, 2025
రేపు రాజమండ్రికి రానున్న మంత్రి నిమ్మల

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 21న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌లతో ఉ.11.40 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మ.3 నుంచి సా.5 గంటల వరకు కలెక్టరేట్‌లో జరిగే డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.
News April 20, 2025
పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో మృతదేహం

మోత్కూరు మండలం పొడిచేడు బస్ స్టాప్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్ రెడ్డిగా గుర్తించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.