News February 19, 2025

సంగారెడ్డి: వేసవి త్రాగునీటి ప్రణాళికలు తయారు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ఎక్కడైనా పైప్ లైన్ల రిపేర్లు ఉంటే మరమ్మత్తులు చేయాలని పేర్కొన్నారు.

Similar News

News April 11, 2026

వరంగల్: అంగన్వాడీ సేవలు స్మార్ట్ దిశగా.. 4జీ ఫోన్ల పంపిణీ

image

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్‌గా మారనుంది. వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 919 కేంద్రాల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం 4జీ సెల్‌ఫోన్లను అందిస్తోంది. మొత్తం 874 ఫోన్లు పంపిణీ చేయనుండగా, ఇప్పటి వరకు పాత 2జీ ఫోన్లతో ఎదురైన సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించనుంది.పోషణ్ ట్రాకర్ యాప్, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి.

News April 11, 2026

వెనక్కి తగ్గిన నువాన్ తుషార

image

IPLలో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు NOC ఇవ్వట్లేదని కోర్టుకెక్కిన నువాన్ తుషార వెనకడుగు వేశారు. కేసును వెనక్కి తీసుకోవడంతో పాటు బోర్డుకు సారీ చెప్పారు. గవర్నింగ్ బాడీని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని మెయిల్ పంపారు. బోర్డు తన పట్ల పారదర్శకంగా వ్యవహరించలేదని, న్యాయం కోసం అలా చేశానని పేర్కొన్నారు. SL బోర్డు NOC ఇవ్వకపోవడంతో RCBకి ప్రాతినిధ్యం వహించాల్సిన తుషార ఇంకా జట్టులో జాయిన్ కాలేదు.

News April 11, 2026

నేరరహిత గ్రామాలే లక్ష్యం కావాలి: ఎస్పీ శబరీశ్

image

తొర్రూరు మండలం చర్లపాలెంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఎస్పీ శబరీశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు నేరరహితంగా మారేందుకు నూతన సర్పంచ్‌లు చొరవ చూపాలని కోరారు. సీసీ కెమెరాల నిఘా వల్ల భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. సర్పంచ్ మహేందర్ పాల్గొన్నారు.