News March 22, 2024

సంగారెడ్డి: వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

image

రానున్న ఏప్రిల్, మే నెలలో తాగునీటి సమస్య లేకుండా వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 19, 2025

మెదక్: పాతూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్

image

మెదక్ మండలం పాతూరు సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News October 19, 2025

మెదక్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సుశాంత్ గౌడ్ ఎంపిక

image

గ్రూప్-2 పరీక్షల్లో మెదక్ పట్టణానికి చెందిన మంగ నారా గౌడ్, ఇందిర దంపతుల తనయుడు సుశాంత్ గౌడ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సుశాంత్ గౌడ్ ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉత్తర్వులు అందుకున్నారు.

News October 18, 2025

దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.