News January 31, 2025
సంగారెడ్డి: శనివారం జరిగే దివ్యాంగుల ప్రజావాణి రద్దు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతినెల మొదటి శనివారం జరుగే దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వయోవృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్‌జెండర్స్ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని అందుకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతరం తిరిగి ప్రజావాణిని నిర్వహిస్తామని వివరించింది.
Similar News
News February 25, 2026
IT స్టాక్స్ పతనం: ₹4.86 లక్షల కోట్లు హాంఫట్!

AI వల్ల IT రంగంలోని కంపెనీల షేర్ల విలువలు ఏకంగా 25% వరకు పడిపోయాయి. నిఫ్టీ IT ఇండెక్స్ ఈ నెలలో 21% నష్టపోగా, కోఫోర్జ్ 26%, LTI మైండ్‌ట్రీ 24% క్షీణించాయి. TCS, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు కూడా 17-22% వరకు విలువను కోల్పోయాయి. మొత్తంగా IT రంగంలో దాదాపు ₹4.8 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరైంది. AI వల్ల కోడింగ్ ఖర్చులు తగ్గి భారత IT కంపెనీల కాంట్రాక్టులు రద్దవుతాయన్న ఆందోళనలే దీనికి కారణం.
News February 25, 2026
తిరుపతి: లవర్‌తో పెళ్లి కోసం కూతురినే చంపేసింది!

తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత(19) భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గ(3)తో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది. ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డికుమార్‌తో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు ఈనెల 19నుంచి కనబడటం లేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగు చూసింది.
News February 25, 2026
‘UK బాకీ పడింది.. వడ్డీతో సహా చెల్లించాల్సిందే’.. ఇండియన్ పోరాటం!

మధ్యప్రదేశ్‌కు చెందిన 63ఏళ్ల వివేక్ రూఠియా తన తాత బ్రిటిష్ ప్రభుత్వానికి 1917లో ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ‘ఇండియన్ వార్ లోన్’ పేరుతో నిధులు సేకరించగా వివేక్ తాత సేఠ్ జుమ్మా లాల్ ₹35,000 రుణంగా ఇచ్చారు. వడ్డీతో కలిపి ప్రస్తుతం ఆ మొత్తం ₹2కోట్లు ఉంటుందని అంచనా. ఈ సొమ్మును రికవరీ చేసేందుకు యూకే ప్రభుత్వంపై దావా వేయనున్నారు.


