News February 12, 2025
సంగారెడ్డి: శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు

ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులపై ఈనెల 9న నిర్వహించిన ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 33మంది ఉద్యోగులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం షోకాజ్ నోటీసులు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిపై సంబంధిత ఉద్యోగులు 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
అనకాపల్లి: రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

పీఎం ఉపాధి కల్పన పథకం కింద రుణాలు పొందేందుకు అనకాపల్లి జిల్లాలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తదితరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షంసున్నీషా బేగం బుధవారం తెలిపారు. తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవారంగానికి రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 26, 2025
తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ విచారం

మత ప్రబోదకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పాస్టర్, మత ప్రబోదకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని, ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.
News March 26, 2025
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన DWO సుధారాణి

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని వనపర్తి సంక్షేమ అధికారిని సుధారాణి అన్నారు. బుధవారం వనపర్తిలోని బసవన్న గడ్డ అంగన్వాడీ సెంటర్‌ను ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ కొంతమంది చిన్నారులు పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేకపోవడంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, వారిని గుర్తించేందుకు జిల్లాలోని అన్నిఅంగన్వాడీ సెంటర్లలో ప్రతి బుధవారం గ్రోత్ మానిటరింగ్ చేయాలని సూచించారు.