News April 3, 2025
సంగారెడ్డి: శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో

సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైనర్స్ చెప్పినటువంటి అంశాలను శ్రద్ధగా విని విద్యార్థులకు ఉపయోగపడేలా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ విద్యాసాగర్, డీఆర్పిలు పాల్గొన్నారు.
Similar News
News April 5, 2025
రైలులో బాలికపై అత్యాచారం.. గాంధీలో వైద్యపరీక్షలు

ఈనెల 2న రక్సల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో అత్యాచారానికి గురైన బాలికకు(12) గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్‌ను అందించారు. కుటుంబ సభ్యులతో HYD వస్తున్న బాలిక.. అర్ధరాత్రి వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్ రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో లోపలికి వెళ్లిన బీహార్‌కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
News April 5, 2025
విజయనగరం జిల్లాలో అనకాపల్లి వాసి మృతి

విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి క్వారీ వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు జారి పడి నాతవరం మండలం చెర్లోపాలెంకు చెందిన చింతల సత్తిబాబు మృతి చెందాడు. గత కొంతకాలంగా క్వారీ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం క్వారీలో పని చేస్తుండగా ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News April 5, 2025
తిలక్ రిటైర్డ్ హర్ట్: ముంబైపై తీవ్ర విమర్శలు

తిలక్ వర్మను రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ మధ్యలోనే బయటకు పంపడంపై మాజీలు, క్రికెట్ ఫ్యాన్స్ ముంబై యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఇది అతడిని అవమానించడమేనని ఫైర్ అవుతున్నారు. తిలక్ స్థానంలో వచ్చిన శాంట్నర్ ఎన్ని సిక్సులు కొట్టాడని ప్రశ్నిస్తున్నారు. శాంట్నర్‌కు హార్దిక్ చివరి ఓవర్లో ఎందుకు స్ట్రైక్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు. GTపై ఫెయిలైన పాండ్యను ఎందుకు రిటైర్డ్ హర్ట్‌గా పంపలేదని దుమ్మెత్తిపోస్తున్నారు.