News April 22, 2025
సంగారెడ్డి: సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా RYV అందించాలి: కలెక్టర్

సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసం పథకాన్ని అందించాలని బ్యాంకులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 51,657 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. నిస్సహాయులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్

ఇంటర్ ఫలితాల్లో మన మేడ్చల్ జిల్లా సత్తాచాటింది. ఫస్టియర్‌లో 77.21 శాతంతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 68,650 మంది పరీక్ష రాశారు. ఇందులో 53,003 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లోనూ విద్యార్థుల హవా కొనసాగింది. 62,539 మంది పాస్ పరీక్ష రాయగా.. 48,726 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 77.91 శాతంతో మేడ్చల్ జిల్లా మూడవ స్థానంలో నిలిచింది.
News April 22, 2025
VZM: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it
News April 22, 2025
కడప: నాగాలాండ్‌కు బదిలీ అయిన యువజన అధికారి

ఉమ్మడి కడప జిల్లా నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణికంఠ కడప నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. జిల్లాలో ఐదు సంవత్సరాల పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. బదిలీపై వెళుతున్న మణికంఠను స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.