News March 2, 2025

సంగారెడ్డి: సీసీ నిఘాలో ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ నుంచి శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 54 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. సమావేశంలో ఇంటర్ జిల్లా అధికారి గోవిందారం పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

విద్యుత్ షాక్‌తో యువకుడి దుర్మరణం

image

మోత్కూరు మండల కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు చేస్తుండగా బద్దిపడిగ భాస్కర్ రెడ్డి (23) విద్యుత్ షాక్‌కు గురైయ్యాడు. ఆత్మకూరు మండలం పారుపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిని తోటి సిబ్బంది భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో పారుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 25, 2025

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: కొల్లు రవీంద్ర

image

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లే పనిలో పడ్డారని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కృష్ణా జిల్లాను అరాచకాల నిలయంగా మార్చారన్నారు.

News October 25, 2025

మెదక్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు

image

మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మధుసూదన్ గౌడ్ కామారెడ్డికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో టాస్క్‌ఫోర్స్ సీఐగా ఉన్న కృష్ణమూర్తిని డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి.. అదనపు ఎస్పీ మహేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.