News March 2, 2025
సంగారెడ్డి: సీసీ నిఘాలో ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ నుంచి శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 54 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. సమావేశంలో ఇంటర్ జిల్లా అధికారి గోవిందారం పాల్గొన్నారు.
Similar News
News March 24, 2025
ధర్పల్లి: ‘పది’ పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.
News March 24, 2025
NRPT: బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. బెట్టింగులతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగులపై ఎల్లప్పుడూ నిఘా ఉంచామని అన్నారు.
News March 24, 2025
గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ తగ్గింపు?

లైఫ్, హెల్త్ పాలసీలపై GST తగ్గింపునకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే సమావేశంలో ఈ పాలసీలపై ట్యాక్స్ తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించవచ్చని తెలిపాయి. అయితే పాలసీ మొత్తాన్ని బట్టి ఈ తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలివారంలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.