News February 18, 2025

సంగారెడ్డి: సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

నిధులు దుర్వినియోగం చేసినందుకు కంది మండలం తూనికల తండా పంచాయతీ కార్యదర్శి రేఖను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివపేట మండలం వెల్టూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో రూ.4 లక్షలు దుర్వినియోగమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుస్తకాల నిర్వహణలో కూడా నిర్లక్ష్యం వహించినట్లు తెలిపారు.

Similar News

News March 14, 2025

NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌ప‌ల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.

News March 14, 2025

‘జియో హాట్‌స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

image

జియో, స్టార్ నెట్‌వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్‌ను చాలామంది యూట్యూబ్‌లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్‌స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్‌ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్‌, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్‌స్టార్ భావిస్తోంది. యాప్‌లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.

News March 14, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి 
➤ రిపోర్టర్‌ను బెదిరించి సెల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు 
➤ సముద్ర స్నానానికి వెళ్లిన ఉపమాక వెంకన్న
➤ ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పిఠాపురం తరలి వెళ్లిన జనసైనికులు 
➤ వడ్డాది వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
➤ నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా-ఎలమంచిలి MLA 
➤ 21న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై ధర్నా
➤ హోలీ ఉత్సవాల్లో చిన్నారుల సందడి

error: Content is protected !!