News October 1, 2024
సంగారెడ్డి: సెల్ ఫోన్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ
సెల్ ఫోన్ రిపేరింగ్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లు వయసున్న వారు అర్హులని చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి అక్టోబర్ 14 నుంచి నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.
Similar News
News October 13, 2024
సిద్దిపేట: ‘అందరికి శుభం జరగాలి’
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్, రంగాధంపల్లి, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. విజయ దశమి అంటే చెడుపై మంచి విజయం సాధించడమని అన్నారు. ఈరోజు పాల పిట్టను చూస్తే మంచి జరుగుతుందని, అందరికి శుభం జరగాలని ఆకాంక్షించారు.
News October 12, 2024
సిద్దిపేట: విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పండగపూట సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. నంగునూర్ మండలం మగ్ధుమ్‌పూర్‌కు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజు(32) శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తూ సిద్దిపేటలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
News October 12, 2024
BREAKING.. ఖేడ్: కలుషిత నీరు తాగి 50 మంది అస్వస్థత
నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట గ్రామంలో కలుషిత నీరు తాగి సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బావిలోని నీరు తాగిన రెండు బీసీ కాలనీలకు చెందిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 50 మంది అస్వస్థతకు గురికాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఒకరిని సంగారెడ్డి ఆస్పత్రికి, ఇద్దరిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.