News August 30, 2024
సంగారెడ్డి: సైబర్ బాధితులకు సత్వర న్యాయానికి బ్యాంకర్ల పాత్ర కీలకం: ఎస్పీ

సైబర్ బాధితులకు న్యాయం జరిగేందుకు బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు సమాచారం ఇవ్వవద్దని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసు అధికారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News September 16, 2025
మెదక్: ‘బాల్యం అనేది చదువుకోవడానికే’

బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, భవిష్యత్ నిర్మించుకోవడానికి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.శుభవల్లి అన్నారు. హవేలీ ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అమూల్యమైన దశ, వయస్సులోనే వివాహం జరగడం వలన బాలల ఆరోగ్యం, విద్య అన్ని దెబ్బతింటాయన్నారు. చిన్న వయస్సులో వివాహం జరపొద్దని సూచించారు.
News September 16, 2025
మెదక్: అత్యధికంగా రేగోడ్లో 12.5 సెంమీల వర్షం

మెదక్ జిల్లాలో అత్యధికంగా రేగోడ్లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.
News September 16, 2025
మాసాయిపేట: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని భవాని అనారోగ్యంతో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో ఆమె చనిపోయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భవాని సాఫ్ట్బాల్ క్రీడలో చురుకుగా ఉండేది. ఆమె మృతి పట్ల ఉపాధ్యాయులు, స్నేహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.