News March 27, 2025
సంగారెడ్డి: స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని వినతి

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సంగారెడ్డిలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఐదు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తీసుకువచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో వేతనాలు విడుదల చేస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ, కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.
News November 25, 2025
విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్

విశాఖకు పర్యాటక రంగంలో తలమానికంగా కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని నగర ప్రజలతో పాటు పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 30 లేదా డిసెంబర్ 1న అధికారికంగా దీనిని ప్రారంభించనున్నారు. విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని సమాచారం.
News November 25, 2025
MBNR: ఐబొమ్మ రవిపై జడ్చర్ల MLA వ్యాఖ్యలు.. మీరేమంటారు.?

ఐబొమ్మ రవిని ప్రజలు రాబిన్హుడ్ హీరోగా భావిస్తున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి <<18378394>>వ్యాఖ్యలు<<>> చేసిన విషయం తెలిసిందే. టికెట్ ధరలు పెంచడం తప్పనే భావనలో వారు ఉన్నారని, ₹1000 కోట్లతో తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రవిని శిక్షించాలని కొందరంటున్నారని, కోర్టు తీర్పు ఎలా ఇస్తుందో వేచి చూడాలంటున్నారు. MLA వ్యాఖ్యలపై మీ కామెంట్.?


