News July 18, 2024
సంగారెడ్డి: హాట్ టాపిక్‌గా మారిన హరీశ్ రావు TRS కండువా.!

పటాన్ చెరులో నిర్వహించిన సమావేశంలో సిద్దిపేట MLA మాజీ మంత్రి హరీశ్ రావు TRS కండువాతో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.
Similar News
News February 12, 2025
నర్సాపూర్: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో దులానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
మెదక్: 21 మండలాలు, 190 ఎంపిటిసి స్థానాలు

మెదక్ జిల్లాలో 21 మండలాల్లో జెడ్పిటిసి, 190 ఎంపిటిసి స్థానాలున్నాయి. ఈనెల 15న ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 5,23,966 మంది ఉన్నారు. పురుషులు 2,52,279 మంది, మహిళలు 2,71,878 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. నామినేషన్ల కోసం 70 కేంద్రాల్లో 91 మంది ఆర్ఓలు, జెడ్పిటీసి ఎన్నికల కోసం 21+4 రిటర్నింగ్ అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు.
News February 12, 2025
మెదక్: టెన్త్ అర్హతతో పోస్టల్ జాబ్స్

ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి డివిజన్‌లో 25 , మెదక్ డివిజన్‌లో 24 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టులు ఉన్నాయి. దీనికి టెన్త్ అర్హత, వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.