News April 9, 2025
సంగారెడ్డి: హాబిటేషన్ సమాచారాన్ని సేకరించాలి: డీఈఓ

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోనీ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాలను సీఆర్పీలు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని పక్కగా సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని రేపు మధ్యాహ్నం జిల్లా కార్యాలయానికి పంపించాలని సూచించారు.
Similar News
News April 23, 2025
PHOTO: పహల్గామ్లో దాడి చేసింది వీరే

జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫొటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
News April 23, 2025
కనగానపల్లి వద్ద ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

కనగానపల్లి మండలంలోని మామిళ్ళపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పుట్టపర్తి అగ్నిమాపక శాఖలో పని చేస్తున్న ఫైర్ కానిస్టేబుల్ సుధాకర్(32) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
మహిళల ఆర్థిక స్వాలంబనే లక్ష్యం: సీతక్క

మహిళల ఆర్థిక స్వాలంబన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సీతక్క ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.