News April 5, 2025
సంగారెడ్డి: హాస్టల్ విద్యార్థి మిస్సింగ్

వట్పల్లి మండల పరిధిలోని దేవునూరు సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు వట్పల్లి పోలీస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 6, 2025
గ్రేట్..అన్నదాతల కోసం 131రోజుల నిరాహార దీక్ష

పంటలకు సరైన మద్దతు ధర ఇవ్వాలని 131 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన రైతు కేంద్రమంత్రుల హామీతో నేడు దీక్ష విరమించారు. పంజాబ్కు చెందిన జగజీత్ సింగ్ దల్లేవాల్ రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న దీక్ష చేపట్టారు. అతని ఆరోగ్యం విషమించడంతో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, రైల్వేశాఖ సహాయ మంత్రి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు దీక్ష విరమించారు.
News April 6, 2025
మెదక్: కోదండ రామాలయంలో కలెక్టర్ పూజలు

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News April 6, 2025
జైపూర్: ఇందారం ఓసీలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె

శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్ కాస్ట్ గనిలో వేతనాలు పెంచాలని ఓబీ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేపట్టారు. ఆదివారం సమ్మె శిబిరాన్ని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రొజ్ ఖాన్, బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ సందర్శించి మద్దతు తెలిపారు. వెంటనే కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.