News April 5, 2025

సంగారెడ్డి: హాస్టల్ విద్యార్థి మిస్సింగ్

image

వట్పల్లి మండల పరిధిలోని దేవునూరు సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు వట్పల్లి పోలీస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 24, 2025

ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

image

ఖమ్మం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నేలకొండపల్లి, ఎర్రుపాలెం 42.9, ఖమ్మం(U), మధిర (సిరిపురం) 42.8, వైరా, ముదిగొండ (పమ్మి) 42.7, చింతకాని 42.6, కూసుమంచి, రఘునాథపాలెం 42.5, ఖమ్మం (R) పల్లెగూడెం 42.4, సత్తుపల్లి 42.2, తిరుమలాయపాలెం 41.8, వేంసూరు, ఏన్కూరు 41.4, కామేపల్లి (లింగాల) 41.0 నమోదైంది.

News April 24, 2025

వరంగల్‌లో గురువారం మెగా జాబ్ మేళా

image

వరంగల్ జిల్లాలో గురువారం మెగా జాబ్ మెళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని రజిత తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ కళాశాలలో గల ఎంప్లాయిమెంట్ ఆఫీసుకు రావాలన్నారు. పూర్తి వివరాలకు 7093168464 సంప్రదించాలని కోరారు.

News April 24, 2025

చేగుంట: రోడ్డు ప్రమాదంలో RMP వైద్యురాలి మృతి

image

చేగుంట శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ వైద్యురాలు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా గాజులరామారం వాసి కమ్మరి మంజుల(45) బుధవారం కూతురు గ్రామమైన కామారెడ్డి జిల్లా రామారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుంది. చేగుంట వద్ద లారీ రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలవడంతో బైక్ ఢీకొని మంజుల అక్కడికక్కడే మృతి చెందింది.

error: Content is protected !!