News March 18, 2025

సంగారెడ్డి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌‌లో స్టేట్ ర్యాంక్

image

సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కి చెందిన జనార్దన్ రెడ్డి సోమవారం విడుదలైన గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2024 జూన్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు పరీక్ష జరిగింది. ఈ క్రమంలో జోన్‌లో 21 ర్యాంక్, స్టేట్‌లో 176వ ర్యాంక్ సాధించిన జనార్దన్ రెడ్డికి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగం వరించింది. జనార్దన్ రెడ్డి ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.

Similar News

News September 15, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కొలనుపాక విద్యార్థులు

image

కొలనుపాక ZPHSకు చెందిన నలుగురు విద్యార్థులు 35వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ధనుష్, మనోజ్ కుమార్, కార్తీక్, చండేశ్వర్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముష్కర్‌లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు.

News September 15, 2025

ఖమ్మం: ఆ గ్రామంలో కోతులను పట్టేస్తున్నారు..!

image

ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో కోతుల బెడదకు గ్రామస్థులు పరిష్కారం కనుగొన్నారు. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టించడంతోపాటు మనుషులు, పిల్లలపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం గ్రామస్థులు కోతులు పట్టేవారిని పిలిపించి, వాటిని బోనులో పట్టుకున్నారు. వాటిని అడవిలో విడిచిపెట్టి, గ్రామంలో శాంతి నెలకొల్పడానికి కృషి చేస్తున్నారు.

News September 15, 2025

గృహ హింస బాధితులకు వరంగల్ పోలీసుల సహాయ హామీ

image

గృహ హింసపై ప్రతి ఒక్కరూ గళం ఎత్తాలని వరంగల్ పోలీస్‌ శాఖ పిలుపునిచ్చింది. బాధితుల హక్కులను కాపాడడంలో సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తక్షణ సహాయం కోసం గృహ హింస బాధితులు ఎప్పుడైనా డయల్ 100కు కాల్ చేయవచ్చని, 24 గంటల సహాయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.