News February 9, 2025

సంగారెడ్డి: 10న ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాస్థాయి అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడంతో ప్రజావాణి కార్యక్రమానికి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News March 22, 2025

అప్పుడు బావురుమని ఏడ్చినా ఫలితం ఉండదు: పిన్నెళ్లి

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణ ట్వీట్ చేశారు. ‘ఓడిపోయినప్పుడు విలువలు మాట్లాడి.. గెలిచినప్పుడు గేలి చేస్తూ శునకానందం పొంది.. రేపు మీరు ఓడిపోయిన తర్వాత బావురుమని ఏడ్చినా ఉపయోగం ఉండదు’ అని అన్నారు. కూటమి నేతలను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ వదిలినట్లు పలువురు చెబుతున్నారు.

News March 22, 2025

గద్వాల: నిరుద్యోగ యువతకు తప్పని సమస్య..!

image

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద లబ్ధిపొందేందుకు రేషన్ కార్డు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పలువురు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినప్పటికీ, పాత రేషన్ కార్డు తొలగించాల్సిన నిబంధనతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పెళ్లయిన వారు తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోనే కొనసాగుతుండడంతో కొత్త కార్డు పొందడానికి సమస్య ఎదురవుతోందని, దీంతో పథకానికి అప్లై చేయని పరిస్థితి నెలకొందన్నారు.

News March 22, 2025

ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

image

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్‌నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.

error: Content is protected !!