News April 9, 2025
సంగారెడ్డి: ’11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి’

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ బుధవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆర్అండ్ బీ కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అనంతరం కల్వకుంట రోడ్లో సభ జరుగుతుందని పేర్కొన్నారు . ప్రజా ప్రతినిధులు, దళిత, బీసీ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.
Similar News
News November 21, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలి: కలెక్టర్

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలతో సమావేశమయ్యారు. తక్షణమే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలని ఆదేశించారు. ఎన్నికలలో తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 21, 2025
నడుము చుట్టుకొలత పెరిగితే డేంజరే

భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. పురుషుల్లో 35.4 అంగుళాలు, స్త్రీలలో 31.5 అంగుళాలు నడుము చుట్టుకొలత దాటితే అంతర్గత కొవ్వు పెరిగి డయాబెటీస్ వస్తుందంటున్నారు. దీనికోసం సమయానికి, సరైన ఆహారం మితంగా తీసుకోవడం, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు.
News November 21, 2025
ఆ రూ.360 కోట్లు ఇవ్వాలి: రోజా

మామిడి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు. ‘చిత్తూరు జిల్లాలో 4.50లక్షల టన్నుల తోతాపురిని రైతులు ప్యాక్టరీలకు తోలారు. కిలోకు ప్రభుత్వం రూ.4, ప్యాక్టరీలు రూ.8 ఇస్తామని చెప్పారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం రూ.180కోట్లు ఇచ్చింది. ప్యాక్టరీలు రూ.8 కాకుండా రూ.4 చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వ మోసంతో రైతులు రూ.180 కోట్లు నష్టపోతారు. రూ.360 కోట్లు ఇచ్చేలా చూడాలి’ అని రోజా ట్వీట్ చేశారు.


